దివిలో వేడుక ఊరంతా పండుగ

Telugu Christian Song

దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనే ఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగా మహా సంతోషమే - ఆహా ఆనందమే ఆహా ఈ రేయిలో - ఓహో ఉల్లాసమే ఇల మెస్సయ్య - జన్మించినాడుగా మన యేసయ్య - ఉదయించినాడుగా మహారాజు - మన యేసు నిన్నే కోరీ - ఇలా వచ్చెనే జగాలేలే - మన యేసు నిన్నే చేర - దిగి వచ్చెనే 1. దేవ దేవుడే - మరియ తనయుడై ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై ప్రేమపూర్ణుడే - పరమ జీవమై లోకాన్ని వెలిగించ వచ్చాడుగా నిను దీవించి తన ప్రేమ చూపాడుగా దారే చూపంగ దేవుడే దయతో దీపంగ నిలిచెనే 2. ఆడే గొల్లలు - పాడే దూతలు వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని ఆ పశుపాకలో - పొంగే సంబరం మనకు
Telugu