దివినేలు స్తోత్రార్హుడా

Telugu Christian Song

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా మొదటివాడవు – కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు (2) మానక నా యెడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు (2) మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు నీ మాటలు జీవపు ఊటలు నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు|| దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2) దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు|| సీయోను శిఖరముపై నను నిలుపుటకే జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2) దివ
Telugu