దేవుడు లోకమును ఎంతో

Telugu Christian Song

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2) నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2) ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ।।దేవుడు।। పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయె ప్రతివానికై (2) ఆదియందున్న ఆ దేవుడు ఏతెంచె నరుడై ఈ భువికి (2) ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ।।దేవుడు।। పాపంధకారములో అంధులుగా చీకటి త్రోవలో తిరుగాడగా (2) జీవపు వెలుగైన ఆ ప్రభువు వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2) ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును (2) ।।దేవుడు।। --Devudu lokamunu yentho preminchenu--
Telugu