ధవళవర్ణుడా – రత్నవర్ణుడా

Telugu Christian Song

ధవళవర్ణుడా – రత్నవర్ణుడా పదివేలలో అతి ప్రియుడా – అతికాంక్షనీయుడా ఎందుకయ్య మాపై ప్రేమ – ఎందుకయ్య మాపై కరుణ 1. ఘోరపాపి నైన నన్ను లోకమంత వెలివేసినా అనాధగా ఉన్న నన్ను ఆప్తులంత దూషించగా నీ ప్రేమ నన్నాదుకొని – నీ కరుణ నన్నోదార్చెను 2. గాయములతో ఉన్న నన్ను – స్నేహితులే గాయపర్చగా రక్తములో ఉన్న నన్ను – బంధువులే వెలివేసినా నీ రక్తములో నను కడిగి – నీ స్వారూప్యము నాకిచ్చితివా 3.అర్హతలేని నన్ను నీవు – అర్హునిగా చేసితివి నీ మహిమలో నిలబెట్టుటకు – నిర్దోషిగా చేసితివి నీ సేవలో నను వాడుకొని – నీ నిత్య రాజ్యము చేర్చితివి --Dhavala varnuda ratna varnuda--
Telugu