ఏ పాప మెఱుఁగని యోపావన

Telugu Christian Song

ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా ||యే పాప|| 1. ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా ||యే పాప|| 2. కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయఁ తులువలు వేఱొకనిఁ దోడుగా నిచ్చినారా ||యే పాప|| 3. చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకుఁ కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా ||యే పాప|| 4. ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే నూది మేకులతో గ్రుచ్చినారా ||యే పాప|| 5. పలువిధంబుల శ్రమలు చెలరేగఁ
Telugu