ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు నేసువా
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించి నావయా
ఎంతో కృపను చూపి దీవించి నావయా
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు నేసువా
1. పాపాల సంద్రమందున పయనించు వేళలో
పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయా ॥ ఏ రీతి ॥
2. నా పాప శిక్ష సిలువపై భరియించి నావయా
నా దోషముల సహించి క్షమియించి నావయా ॥ ఏ రీతి ॥
--Ye reethi nee runam theerchukondu nesuva--