ఏ యోగ్యతా లేని నన్ను

Telugu Christian Song

ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా నీకేమి చెల్లింతును నీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా|| కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నను మార్చుటకు (2) పావన దేహంలో గాయాలు పొంది (2) రక్తమంత చిందించినావా ||నీకేమి|| సుందరమైన నీ రూపమును మంటివాడనైన నాకీయుటకు (2) వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2) నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి|| పాపము వలన మృతినొందిన అపరాధినైన నను లేపుటకు (2) నా స్థానమందు నా శిక్ష భరించి (2) మరణించి తిరిగి లేచావా ||నీకేమి|| --Ye yogyatha leni nannu neevu preminchinaavu--
Telugu