ఈ దీనుని దయగనవా ఓ దయానిధీ
ఈ పాపిని కృప చూడవ ఓ కృపాంగురీ ||2||
కల్ల లాడ వెరవ లేదు సంపాదన కై
చిల్లిగవ్వ విడువలేదు పేదలకై
ఈ లోభిని దయగనవా ఓ దయానిధీ
ఈ పాపిని కృప చూడవ ఓ కృపాంగురీ
కామంధుడనై కాలమెల్ల గడిపితి
కామినీ సేవకే జవసత్వమును వీడితి ||2||
ఈ అంధుని దయగనవా ఓ దయానిధీ
ఈ పాపిని కృప చూడవ ఓ కృపాంగురీ
కండకావరమును కనిన వారినందరిన్
కొట్టితి తిట్టితి చిత్ర హింస పెట్టితి
ఈ క్రూరుని దయగనవా ఓ కృపాంగురీ
ఈ పాపిని కృప చూడవ ఓ దయానిధీ
--Ee deenuni dayaganava oo dayanidhi--
--Raraja chandrudu--
--Ra raja chandrudu--