ఈ కుహూతము నిశీధి శూన్య హృదయ గగన వీధి
రాక రాక దయచేసిన రాక పూర్ణ కళానిధి ||2||
ఎవరోయీ ఎవరోయీ.. ఎవరోయీ..యీ .. ప్రసంగి
చీకటి ముసిరిన వాకిట ఒక వెన్నెల వేకువలా
నెరవారిన యద ముంగిట మరు మల్లెల తొలకరిలా
తరగ నెత్తి నాలో ఒక తరుణా రుణ రాగ జగతి ||ఎవరోయీ||
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు
యద ముంగిట తల వాకిట
మౌకికముల రంగవల్లి మరకథమణి తోరణాలి
అంతరంగమంతా ఒక చింతామణిదీ ఇది ||ఎవరోయీ||
తొలి భవముల అందమైన అనుభవములకు అద్దములా
తలపులింకి పోయిన ఈ తనువున కొక అర్ధముల
ప్రభువే నా యేసే నా ప్రభువే నా యేసే నా
చరమౌశ పరమావధి ||ఎవరోయీ||
--Ee kuhuthamu niseedhi soonya--
--Raraja chandrudu--
--Ra raja chandrudu--