ఈ పరిణయ శుభవేళ స్వాగతం

Telugu Christian Song

ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవ వరుడా (వధువా) స్వాగతం సంధించను నీ సతిన్ (పతిన్) అందుకొనుమా స్వాగతం 1. దివ్వమైన స్నేహ్హ బంధం అలరించగా నవ్యమైన ప్రేమ గీతం పలికించగా మరువక తండ్రి మాట మదినుంచగా వరుడగు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం 2. కాలు మోపు ఇంటిలోన మణిదీపమై మేలు చేసి తృప్తినొందు గుణశీలియై భర్తకు విలువనిచ్చు వినయ మూర్తియై కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తియై విరజాజులు పలికాయి స్వాగతం వెలగాలని ఈ ధరలో స్వాగతం --Ee parinaya shubhavela swagatham--
Telugu
17 views