ఏలాంటి వాడవైనా

Telugu Christian Song

ఏలాంటి వాడవైనా నీ వెంత ఘనుడవైనా కనుమూసే కాలమొకరోజు ఉన్నదని మరువబోకుమన్నా 1.నీకు మేడ మిద్దెలున్నా నీవు ప్రభుని చూడలేవు మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి ప్రభునడిగి చూడమన్నా |ఏలాంటి| 2.నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగకన్నా ఆ ధనము కాస్తా తరిగిపోతే దరికెవరు రారు సున్నా |ఏలాంటి| 3.పాపుల కొరకు ప్రభువు కలువరిగిరిపైన ఆసిల్వవేసి దుర్మారులంత బహుబాధ పెట్టిరన్నా |ఏలాంటి| 4.నీవు పాపరోగివయ్యా ప్రభు పిలుచుచున్నడయ్యా ఆ ప్రభువునే పాదాలసాక్షిగా ఎరిగి నడువుమయ్యా |ఏలాంటి| --Yelanti vaadavaina neeventha--
Telugu