ఎండిన ఎడారి బ్రతుకులో

Telugu Christian Song

ఎండిన ఎడారి బ్రతుకులో నిండైన ఆశ నీవెగా యేసు నిండైన ఆశ నీవెగా తడబడెడు నా పాదములకు తోడు నీవె గదా యేసు తోడు నీవె సదా 1. ఎండమావులు చూచి నేను అలసివేసారితి జీవజలముల ఊట నీవై సేదదీర్ఛితివే నా బలము నీవైతివే యేసూ బలము నీవైతివే 2. నిత్య మహిమకు నిలయుడా నీ దివ్యకాంతిలోనా నీదు ఆత్మతో నన్ను నింపి ఫలింప జేసితివే నా సారధి నీవైతివే యేసూ సారధి నీవైతివే 3. అంధకార లోయలెన్నో ఎదురు నిలచినను గాయపడిన నీ హస్తమే నను గమ్యము చేర్చును నా శరణు నీవే గదా యేసూ శరణు నీవే గదా --Yendina yedaari brathukulo nindaina aasa--
Telugu
15 views