ఎందుకనీ నేనంటే ఇంత

Telugu Christian Song

ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన – ఇంత కరుణ జడివాన లోయలో – ఎదురీత బాటలో ఎన్నడూ వీడనీ – దైవమా యేసయ్య ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన – ఇంత కరుణ 1. ఆశ చూపే లోకం – గాయాలు రేపెనే గాలి వానై నాలో – నను కృంగదీసెనే మాతృమూర్తి నీవై – లాలించె నన్నిలా ఆదరించసాగే – నీ ప్రేమ వెన్నెల క్షణమైనా – యుగమైనా – నీ మమతే కనుపాపలా 2. మోయలేని భారం – నీపైన మోపగా ఆరిపోదు దీపం – నీ చెంతనుండగా ఎండమావియైనా – నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా – నా తోడు నీవెగా కలనైనా – ఇలనైనా – నీ కృపలో కాపాడవా --Yendukani nenante intha prema--
Telugu
1 views