ఎందుకో ఈ ప్రేమ

Telugu Christian Song

ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2) ఏ యోగ్యత లేని ఓటి కుండను నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2) ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో|| నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే అయినా నీవు క్షమియించినావే ఊహించని మేలులతో దీవించినావే నా సంకటములను కదా తీర్చినవే (2) ఏ యోగ్యత లేని దీనుడను ఏమివ్వగలను నీ ప్రేమకు (నా) సర్వం నీకే అర్పింతును – (2) ||ఎందుకో|| మా కొరకు బలి పశువై మరణించినావు మా పాప శిక్ష తొలగించినావు పలు విధముల శోధనలో తోడైనావు ఏ కీడు రాకుండ మేము కాచినావు (2) రుచి చూపినావు నీ ప్రేమను ఆ ప్రేమలో నేను జీవింతును నీవే నాకు ఆధారము – (2) ||ఎందుకో|| --Yenduko ee prema nanninthag
Telugu