ఎంత దీనాతి దీనమో

Telugu Christian Song

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2) నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది 1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2) ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత|| 2.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2) దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత|| 3.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2) ||ఎంత|| --Yentha deenathi deenamo oo yesayya--
Telugu