ఎంత కాలమో ఈ లోక

Telugu Christian Song

ఎంత కాలమో ఈ లోక ఆశలపై ధ్యాస ఇంకెంత కాలమో ఈ లోక భోగాల వేట కాలం పరిపూర్ణమాయెను దుర్దినములు మొదలాయెను ఇకనైనా కనులు తెరచుకో ఓ నేస్తమా ఎలీషా తరువాత ప్రవక్తగా ఉండవలసిన గెహాజి లోకాశలతో లాగబడి కుష్టి వ్యాధితో కృశియించే ఏ దురాశతో ఈడ్వబడుచుంటివో ఓసారి యోచించుకో నేస్తమా పండ్రెండుమంది అపోస్తులలో ఉండవలసిన ఆ యూదా ధనాపేక్షతో లాగబడి ఉరి వేసుకుని మరణించే ఏ దురాశతో ఈడ్వబడుచుంటివో ఓసారి యోచించుకో నేస్తమా ఎంత కాలమో ఈ లోక ఆశలపై ధ్యాస ఇంకెంత కాలమో ఈ లోక భోగాల వేట కాలం పరిపూర్ణమాయెను దుర్దినములు మొదలాయెను ఇకనైనా కనులు తెరచుకో ఓ నేస్తమా --Yentha kaalamo ee loka aasalapai dhyasa--
Telugu
1 views