ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా

Telugu Christian Song

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన ||2|| సంతోషం ఎక్కడ ఉందనీ సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ ||2|| జగమంతా వెదికాను జనులందరినడిగాను ||2|| చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి|| ప్రేమనేది ఎక్కడ ఉందనీ క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ ||2|| బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను ||2|| చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి|| సత్యమనేది ఎక్కడ ఉందనీ నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ ||2|| ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను ||2|| చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి|| --Yentha manchi devudavayya yesayya chinthalanni theerenayya
Telugu