ఎంతో వింత ఎంతో చింత

Telugu Christian Song

ఎంతో వింత ఎంతో చింత -యేసునాధున్ మరణమంత= పంతముతోఁ జేసిరంతా-సొంత ప్రజలూ యేసునంత !!ఎంతో!! 1.పట్టి కట్టి నెట్టి కొట్టి-తిట్టి రేసునాధు నకటా=అట్టి శ్రమల నొంది పలుక-డాయె యేసు రేడునాడు !!ఎంతో!! 2.మొయ్యలేని మ్రాను నొకటి-మోపిరేసు వీపుపైని =మొయ్య లేక మ్రానితోడ-మూర్చబోయేఁ నేసు తండ్రి !!ఎంతో!! 3.కొయ్యపై నేసయ్యను బెట్టి-కాలు సేతులలోఁ జీలల్=కఠిను లంతగూడి కొట్టిరి-ఘోరముగ క్రీస్తేసున్ బట్టి !!ఎంతో!! 4.దాహముగొనఁ జేదుచిరకఁ-ద్రావ నిడిరి ద్రోహులకటా= ధాత్రిఁ ప్రజల బాధకోర్చి -ధన్యుడా దివికేగె నహహా!!ఎంతో!! 5.బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్ - బారె నీరు రక్త మహహా =యేరై పారె యేసు రక్త-మెల్ల ప్రజల కెలమి నొసగు!!ఎంతో!!
Telugu