ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ

Telugu Christian Song

ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరుగులు ఓ క్షణము తీరికైన లేని ఉరుకులు ఈ లోక ధనమును అధికార బలమును ఈ లోక ఘనతలు శరీర సుఖములు వెతుకుచుంటే దొరుకు నలసటే verse 1: నీ కలలు కోరికలకు అంతమంటూ ఉండదు నీవెన్ని పోందుకున్నను సంతృప్తి మిగలదు ఊహించినట్లు సిరులు నీకు సుఖములివ్వవు ఈ లోక భోగమంతయు నిరాశ మాత్రమే ఈ లోకమంతయు నీ సొంతమైనను నీ హృదిలో మాత్రము ఓ లోటు ఉండును ఆ లోటు యేసుతోనే తీరును verse 2: అనిత్యమైన వాటి వెనుక పరుగు వ్యర్ధము నిత్యుడైన యేసు వైపు నేడే తిరుగుము యేసు నిత్య జీవము నీకివ్వవలెనని సిలువ పైన మరణమొంది తిరిగి లేచెను యేసు ప్రభువని అంగీకరించితే పరిశుద్ధాత్ముడు నీ హృదిలో చేరును ఆ హృదిలో వెలితి ఏల ఉండును --Yennal
Telugu