ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

Telugu Christian Song

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో|| బాధలలో మంచి బంధువువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2) చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నియు కడిగిన దేవా (2) నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో|| శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2) హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో నడిపించినావు (2) నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో|| --Yenno yenno melulu chesavayya--
Telugu
1 views