ఎనలేని ప్రేమ నాపైన

Telugu Christian Song

ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా నా పాపము కొరకు రక్తమును కార్చి ప్రాణమునర్పించిన నా దేవా (2) ఊహించగలనా వర్ణింప తగునా ఆ గొప్ప సిల్వ త్యాగము (2) ఆ గొప్ప సిల్వ త్యాగము ||ఎనలేని|| కొరడాలతో హింసించినా మోముపై ఉమ్మి వేసినా (2) చెమట రక్తముగా మారినా (2) ||ఊహించగలనా|| ముళ్ల కిరీటముతో మొత్తినా బల్లెముతో ప్రక్క పొడచినా (2) పరలోక తండ్రియే చేయి విడచినా (2) ||ఊహించగలనా|| --Yenaleni prema na pai choopi--
Telugu