ఏపాటిదాననయా – నన్నింతగ

Telugu Christian Song

ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటిదాననయా – నాపై కృప చూపుటకు నా దోషము భరియించి – నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు – కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా – నీ కృపకు సాటియేది || ఏపాటి || కష్టాల కడలిలో – కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు – నన్నాదరించావు అందరు నను విడచిన – నను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని – నా తోడై నిలిచితివా || ప్రేమించే || నీ ప్రేమను మరువలేనయ్య – నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను – ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము – నీవిచ్చినదేనయ్య నీవిచ్చిన జీవముకై – స్తోత్రము యేసయ్య || ప్రేమించే || --Yepaati d
Telugu