పల్లవి: ఎవరో నన్నిలా మార్చినది
ఎడబాయని కృప చూపినది
ఎవరు చూపని అనురాగమును
ఏదో తెలియని ఆప్యాయతను
చూపించినది ఇంకెవ్వరు
ఇదే కదా ప్రేమ యేసయ్యా ప్రేమ
మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ
1. దేహమే దేవుని ఆలయమేనని
దేవుని ఆత్మకు నిలయము నేనని
మలినము కడిగి ఆత్మతో నింపి
నను ముద్రించి శుద్ధహృదయము
కలిగించినది రాకడ కొరకే
2. మార్గము తెలియక మౌనము వీడక
వేదన కలిగిన నను విడనాడక
ప్రేమతో చేరి గమ్యము చూపి
ఒంటరి చేయక జంటగా నిలచి
వేదన బాధలు తొలగించినది
3. చీకటి కమ్మిన చెలిమే వాకిట
చెదరిన మనస్సుతో ఒంటరినై
సత్యము నమ్మక మమతలు వీడి
ఎన్నడు ప్రభుని స్వరమును వినకా
శిలగా మారిన నను మార్చినది
--Yevaro nannila marchinadi yedabaa