గడిచిన కాలమంతా – నను

Telugu Christian Song

గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2) మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును (2) ||గడిచిన|| ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు (2) నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి (2) ||మరో యేడు|| నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా (2) నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి (2) ||మరో యేడు|| --Gadichina kaalamantha nanu nadipina naa--
Telugu