గీతం గీతం జయ జయ గీతం

Telugu Christian Song

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము అను పల్లవి: యేసు రాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము 1. చూడు సమాధిని మూసినరాయి - దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా దైవసుతుని ముందు 2. వలదు వలదు ఏడువ వలదు - వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి 3. అన్న, కయప, వారల సభయు - అదరుచు పరుగిడిరి ఇంక దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి 4. గుమ్మలు తెరిచి చక్కగ నడువుడు - జయ వీరుడు రాగా మీ మేళ తాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి --Geetham geetham jaya jaya geetham--
Telugu