గొప్ప దేవుడవని శక్తి

Telugu Christian Song

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షన దుర్గమని నీ కీర్తినే నేను కొనియాడెదన్ హల్లెలూయా నా యేసునాధా హల్లెలూయా నా ప్రాణనాధా 1. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలడని అద్వితీయుడని ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను హల్లెలూయా నా యేసునాధా హల్లెలూయా నా ప్రాణనాధా 2. సాగరాన్ని రెండుగ చేసినావని సాతాను శక్తులను ముంచినావని సర్వోన్నతుడని సర్వసంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్ హల్లెలూయా నా యేసునాధా హల్లెలూయా నా ప్రాణనాధా --Goppa devudavani sakthi sampannudani--
Telugu
15 views