గొప్పదేవుడా – మహోన్నతుడా

Telugu Christian Song

గొప్పదేవుడా – మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును 1. నా దీనదశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని నీ సన్నిధిలో నివసింపజేసితివి నీ ప్రభావమహిమాలకే నీ సాక్షిగా నిలిపితివి ॥గొప్ప॥ 2. వివేకముతో జీవించుటకు విజయముతో నిను స్తుతించుటకు నీ రక్షణతో అలంకరించితివి నీ ఆనందతైలముతో నన్నభిషేకించితువి ॥గొప్ప॥ 3. సర్వసత్యములో నే నడుచుకొని విత్య సీయోనులో నేనిలుచుటకు జీవపు వెలుగులో నడుపించుచున్నావు నీ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు ॥గొప్ప॥ --Goppadevuda mahonnathuda aathmatho sathyamutho--
Hosanna ministries
Telugu