గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా (2)
1. ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2)
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)
2. సంఘములో నీవు పెద్దవైనా
పాటలెన్నో నీవు పాడినా (2)
వాక్యమును నీవు బోధించినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)
3. ఉపవాసములు ఎన్ని ఉన్నా
ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2)
ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2)
--Gorre pilla jeeva grandhamandu nee perunnadha--