హృదయ గగన సీమలో
తారకాళి వీధిలో
నడచి వచ్చుచుండెను
రారాజా చంద్రుడు
మన యేసు దేవుడు
మన యేసు దేవుడు
నవరత్న ఖచిత సింహాసనమ్ అధిరోహించగా ||2||
నవద్వారపురిని దశముద్వారముంచి
శాశ్వత స్వర్గము చేయగా ||హృదయ||
చేలాన్చనములు తళతళమని మెరయ ||2||
దశదిశలన్ దివ్యాత్మల
జయఘోషలు రేగగా
జయహో ||4|| ||హృదయ||
పరహితమే పరమధర్మమనే
రాజ దండము నీ
క్షమధమాలే తనకు పాద
రక్షలైన రక్షకుడదే
నడచి వచ్చుచుండేను
రారాజా చంద్రుడు. .
మన యేసు దేవుడు ||హృదయ||
--Hrudaya gagana seemalo--
--Raraja chandrudu--
--Ra raja chandrudu--