ఇది రక్షణ కృపకాలం

Telugu Christian Song

ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం ఇక ఆలస్యం లేదిక మనస్సు మార్చుకోనీవిక (2) 1.రాజ్యముల రాజ్యముల్ జనములపై జనములు ఎటుచూచిన మరణముల్ ఎటుకేగిన యుద్దముల్ ||ఇది|| 2.దేశమంతా క్షామమే జగమంతా అశాంతియే శ్రమకాలం మొదలాయే యుగసమాప్తి సమీపించే ||ఇది|| 3.అంత్య క్రీస్తుపాలన- అతి శీఘ్రమే రానుండే విశ్వాసులకు నిందలు భక్తులకు హింసలు||ఇది|| 4.క్రైస్తవుడా మేలుకో సోదరుడా స్థిరపడు నిర్లక్ష్యముగా నుండకు ఆత్మయందే బలపడు ||ఇది|| --Idi rakshana krupa kaalam--
Telugu
1 views