ఇదిగో నా జీవితం - దేవా నీకంకితం
బ్రతుకైనా చావైనా నీకోసమే (2)
నాకున్నది నీవఒక్కడివే
నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా
ఆరాధింతును నా పూర్ణ హృదయముతో
నిన్ను ఘనపరతును నా జీవితాంతము
యేసయ్య యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య |2|
1. నీ వైపే చూడక - నీ ప్రేమే నేనెరుగక
సిధిలమైన శిలనై నేనుండగా (2)
నన్ను ప్రేమించగా వెంటాడితివి
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి (2)
ఎన్నాలుగా నాకై వేచియున్నావు
ఎందుకని ఇంత ప్రేమించితివి (2)
| ఇదిగో నా జీవితం |
2.దివ్యమైన స్నేహము - నా మదిలోని కావ్యము
పరిమళించు పద్మము నీవేనయ్య (2)
ఊహల రేఖలకు ఊపిరి పోసితివి
ఊహకు మించిన స్థానమునిచ్చితివ