ఇంతగ నన్ను - ప్రేమించినది
నీ రూపమునాలో - రూపించుటకా
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
1. శ్రమలలో సిలువలో - నీ రూపు నలిగినదా
శిలనైనా నన్ను - నీవలె మార్చుటకా
శిల్ప కారుడా - నా యేసయ్యా
మలుచు చుంటివా - నీ పోలికగా || ఇదియే ||
2. తీగలు సడలి - అపస్వరములమయమై
మూగబోయనే - నా స్వర మండలము
అమరజీవ - స్వరకల్పనలు
నా అణువణువునా - పలికించితివా || ఇదియే ||
--Inthaga nannu preminchinadi--