ఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడనయా
సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా
కరుణామయా దయాహృదయా
1. కరగని కఠిన పాషాణం నా హృదయము గెలిచితివా
తరగని నీ ప్రేమను చాటను నన్నిల నీవు పిలచితవా
2. ఎండిన మోడు ఈ జీవితం చెగురింపగా చేసితివా
చెరిగని నీదు గ్రంధములో నా ప్రేరును నీవు రాసితివా
--Inthati premanu vinthaga choopanu--