అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా |2|
ఇశ్రాయేలు కాపరి - బహుగొప్ప నేర్పరి
నీకు సాటియెవరు యేసయ్యా |2|
సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా
ప్రభాకరుడా బహు బలవంతుడా |2|
సత్యవంతుడా మహా పరిశుద్ధుడా
ఆరాధనకు యోగ్యుడా
1. నీలి మేఘమును నీడగా మార్చి
అగ్ని స్థంభమును కాంతిగా నిలిపి |2|
సైన్యములకు నీవే సారధిగా నిలిచి
నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన |2|
మా పక్షమైయున్న- మహారాజువు నీవే
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
| సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా |
2. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై
నిరాశల నీడను తొలగించెదవు |2|
విస్తారమైన నీకృపలతో నింపి
నిస్సారమైన బ్రతుకును మార్చెదవు |