జ్ఞానులు చూడవెళ్ళిరి బెత్లెహేము

Telugu Christian Song

జ్ఞానులు చూడవెళ్ళిరి బెత్లెహేము పురమునకు పశువుల పాకలో పరుండిన యేసుని చూచి సంతోషించి ఆరాధించిరి చిన్ని యేసు దేవుడని చాటి చెప్పిరి చిన్ని యేసు దేవుడని చాటి చెప్పిరి 1. ప్రేమను ఇచ్చి విమోచన తెచ్చి మానవాళి స్థితిని మార్చుటకై జీవ మార్గమును బహుకరించిన చిన్ని యేసు రాజు జన్మించే సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన వారికి ఇల సమాధానం 2. రాజుల రాజుగా భువిపైకరుదెంచి ఇమ్మానుయేలుగా జన్మించెనే లోకమునకు వెలుగును ప్రసాదించి మనకు ఆనందం తెచ్చెనే చిన్ని యేసు దేవుడని చాటి చెప్పిరి క్రీస్తుయేసు దేవుడని చాటి చెప్పిరి --Gnanulu chooda velliri bethlahemu puramunaku--
Telugu