జీవాధిపతివి నీవే నా

Telugu Christian Song

జీవాధిపతివి నీవే నా యేసయ్య నాకున్న ఆధారము నీవేనయ్యా (2) నీవుంటే చాలు, కీడు కాదా! మేలు లెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు (2) ||జీవాధిపతివి|| ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు (2) నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యము నీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము (2) ||నీవుంటే|| రాజుల హృదయాలను తిప్పువాడవు నిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు (2) ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగను నీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా (2) ||నీవుంటే|| --Jeevadhipathivi neeve naa yesayya--
Telugu