పల్లవి: జయము క్రీస్తూ - జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
జయము క్రీస్తూ - జయ జయ లివిగో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో
1. దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
సాతానుని జాడ - సిలువలోనే దునుమాడ
జయగీతం రహిబాడ |జయము..
2. పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాపాత్ముల కెంత - భాగ్యమెంచె క్షమియించె
పాడుదమా స్తుతియించి |జయము..
--Jayamu kreesthu jaya jaya livigo--