క్రొత్త పాట పాడుదము యెహోవాకు
సర్వ భూమి ప్రభువునకు పాడుడి (2)
ఆయన నామము కీర్తించుడి
ఆయన రక్షణ ప్రచురింపుడి (2)
హల్లెలూయా హల్లెలూయా
యెహోవాకు స్తుతి చెల్లింతుము
హల్లెలూయా హల్లెలూయా
సర్వ సృష్టి ఆయనను వర్ణింతురు (2) ||క్రొత్త||
జనముల మధ్య ఆయన మహిమను
సకల ప్రజలలో ఆయన అద్భుతములను (2)
వివరించుడి ప్రకటించుడి
సువార్త వ్యాపింపజేయుడి (2) ||క్రొత్త||
యెహోవా మహోన్నతుడు
స్తుతింపదగినవాడు (2)
సమస్త దేవతల కంటె
భయముగా ఎంచదగినవాడు (2) ||క్రొత్త||
ఆకాశములు సంతోషింపగలదు
భూమి ఉల్లసింపగలదు (2)
సముద్రము గర్జింపగలదు
దేవుడు భూమిని తీర్పుకొనుటకు వచ్చునని (2) ||క్రొత్త||
--Krotha paatalu paad