క్రొత్త యెడు మొదలు బెట్టెను - మన బ్రతుకు నందు - క్రొత్త యెడు
మొదలు బెట్టెను - క్రొత్త మనసుతోడ మీరు - క్రొత్త యేట ప్రభుని సేవ
దత్తరపడకుండజేయు - టుత్తమోత్తమంబు జూడ
1. పొంది యున్న మేలులన్నియు - బొంకంబుమీఱ - డెందమందు
స్మరణజేయుచు యిందు మీరు మొదలుబెట్టు - పందెమందు
బారవలయు నందముగను రవిని బోలి - నలయకుండ సొలయకుండ
...క్రొత్త...
2. మేలు చేయదడవొనర్చగా - మీరెఱగునట్లు కాలమంత నిరుడు
గడచెగా - ప్రాలుమాలి యుండకుండ - జాలమేల సేయవలయు
జాల జనము కిమ్మాను - యేలు నామ ఘనత కొరకు
...క్రొత్త...
3. బలములేని వారమయ్యును - బలమొందవచ్చు - గలిమి మీఱ గర్త
వాక్కున - నలయకుండ నడగుచుండ - నలగకుండ మోదమొంది
బలమొసంగు సర్వవిధుల - నెలవి