క్షణమైన నీవు నను విడచి

Telugu Christian Song

క్షణమైన నీవు నను విడచి పోలేదుగా కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2) కునుకక నిదురించక కనుపాపలా నను కాచియుంటివి (2)||క్షణమైన|| పర్వతములు అన్ని తొలగిపోయినా నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2) నా వెన్నంటి నా తట్టు నిలచి కన్నీటినంతా తొలగించితివి (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)||క్షణమైన|| శోధనలు నన్ను చుట్టుముట్టినా శ్రమలే నన్ను కృంగదీసినా (2) నా తండ్రివై నా తోడుగా నిలచి నా భారములన్ని తొలగించితివే (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)||క్షణమైన|| --Kshanamaina neevu nannu vidichi poleduga--
Telugu
1 views