కాచితివి గతకాలం

Telugu Christian Song

కాచితివి గతకాలం నీ కృపలో నా దేవా ఊహించలేని మేలులు చేసి నీ సన్నిథిలో సాక్షిగా నిలిపితివి 1. అంజూర చెట్లు పూయకుండిననూ ద్రాక్ష చెట్లు ఫలింపక పోయిననూ నీయందే నేను ఆనందించెదను నీలోనే నేను అతిశయించెదను యేసయ్యా యేసయ్యా నా క్షేమం నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా సర్వం నీవయ్యా 2. పైరు పంటకు రాకపోయినను శాలలో పశువులు లేకపోయినను నీయందే నేను ఆనందించెదను నీలోనే నేను నిలచి ఉండెదను యేసయ్యా యేసయ్యా నా క్షేమం నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా సర్వం నీవయ్యా --Kachithivi gathakaalam nee krupalo naa deva--
Telugu
15 views