కీర్తింతును నీ నామము

Telugu Christian Song

కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా (2) మదిలో ధ్యానించి (2) తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా ||కీర్తింతును|| ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా (2) కల్వరిలో కృప చూపి కలుషాలు బాపిన.. నా యేసయ్యా ||కీర్తింతును|| వేనోళ్ళతోను పొగిడినా నీ ఋణము తీరునా (2) ఇన్నాళ్లు కన్నీళ్లు (2) తుడిచావు జాలితో.. నా యేసయ్యా ||కీర్తింతును|| జీవింతు నేను నీ కొరకే నీ సాక్షిగా ఇలలో (2) సేవించి పూజింతు (2) నీ పాద సన్నిధిలో.. నా యేసయ్యా ||కీర్తింతును|| --Keerthinthunu nee naamam manasara yesayya--
Telugu
1 views