కలిగియున్న సమస్తము

Telugu Christian Song

కలిగియున్న సమస్తము నీదేనయ్యా పొందుకున్నది నీ దగ్గరేనయ్యా నీదే ఆ త్యాగము నీదే మా జీవము మా బలము నీ బలహీనతను వివరింపగలదా మా ధనము నీ దీనత్వమును వర్ణింపదగునా మాకున్న సమస్తము నీ లేమిలోనిదే మా శక్తి బలములు బలహీనుడ నీవే మా ధనము ఈ బలము నిను కొలచుటకై చాలదయ్యా మా అధికారం నీ దాసత్వమును వెక్కిరింపగలదా ఈ అలంకార అందములు నీ గాయపడిన శరీరము సాటిదా మాకున్న సమస్తము నీ లేమిలోనిదే ఈ అధికారంధములు నీ పాత్రలోనిదే మా జ్ఞానము ఈ ప్రాయము నిను స్తుతించుటకై చాలదయ్యా --Kaligiyunna samasthamu neede nayya--
Telugu