కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగాలమా
నీ మహోన్నతమైన ప్రేమా ||2||
ఆరాధింతును ||4||
రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను ||2||
ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది ||2||
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది ||2|| ||ఆరాధింతును||
సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి ||2||
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది ||2|| ||ఆరాధింతును||
--Kalamulatho raayagalana kavithalatho--