కలువరిగిరిలో సిలువధారియై

Telugu Christian Song

కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా ||2|| అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా ||2|| నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా ||2|| ||కలువరిగిరిలో|| దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను ||2|| ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా ||2|| ||కలువరిగిరిలో|| --Kaluvari girilo siluva dhaariyai--
Telugu