కలవంటిది నీ జీవితము

Telugu Christian Song

కలవంటిది నీ జీవితము కడుస్వల్పకాలము యువకా అది ఎంతో స్వల్పము విలువైనదీ నీ జీవితం వ్యర్ధము చేయకుమా యువకా వ్యర్ధము చేయకుము బహు విలువైనదీ నీ జీవితం వ్యర్ధము చేయకుమా యువతీ వ్యర్ధము చేయకుము 1. నిన్ను ఆకార్షించే ఈ లోకము కాట్లు వేసే విష సర్పము యువకా అది కాలు జారే స్ఠలము ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంతము ఘోర నరకము యువకా అదియే నిత్య మరణము 2. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును పాపం క్షమియించి రక్షించును ఆ మోక్ష మందు నీవుందువు యుగయుగములు జీవింతువు నీవు నిత్యం ఆనందింతువు --Kalavantidi nee jeevitham--
Telugu
10 views