కనుగొంటిని నిన్నే ఓ

Telugu Christian Song

కనుగొంటిని నిన్నే ఓ నజరేయా - సమర్థుడవని సహాయము చేయ.. నీ ప్రభావము - నాలోకి చేరగా - నా స్వరూపమూ - మారిపోయెగా.. 1. ప్రయత్నాలు చేసి వేసారియుంటిని - ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని.. వైద్యులచుట్టూ - కాళ్లు అరిగేటట్టు - ఎంతతిరిగినా - సరికాక యుంటిని.. 2. స్వంతజనులతోనే వెలివేయబడితిని - అపనిందలపాలై మతిపోయి చెడితిని.. బ్రతుకెందుకని - మనసే చంపుకుని - జీవశ్చవమై - ఇల మిగిలియుంటిని.. 3. నీ మహిమను గూర్చి వార్తలను వింటిని - స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని.. ధైర్యములేక - ఎదురుగ రాలేక - వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని.. --Kanugontini ninne oo najareya--
Telugu
1 views