కనుమరుగు చేయుదుననే వారెదుట,
ఎనలేని వృద్ధిచేయు దేవా
నిన్ను కనుమరుగు చేయుదుననేవారెదుట
ఎనలేని వృద్ధిచేయు దేవా
సరిచేయ జాలని నీ బ్రతుకు
సరిపరచ తానే వచ్చుచున్నాడు
ఓహో సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణునిచేయున్
నిన్ను సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణునిచేయున్
నిన్ను బలపరచి పూర్ణునిచేయున్
అల్పకాలం పాటు, పొందిన శ్రమలన్ని
మంచువలె నీ యెదుట కరిగిపోవున్
నీ కష్టము, నష్టము అన్నియును తీరున్
క్షేమములె నీ దరిచేరున్
ఖ్యాతిని అణచివేయు, కూటములు అన్నియును
యేసు నీ తోడని తలలు వంచున్
విరోధులు చేసిన గాయములు మానున్
నీ ఖ్యాతి నీ దరిచేరున్
--Kanumarugu cheyudunane vaareduta--