కొంత యెడము నీవైనా

Telugu Christian Song

కొంత యెడము నీవైనా నే సాగలేను నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను కొంత యెడము నీవైనా మరచిన వేళలో మది నీ పలుకులు సడలి కట్టడలు మలినము తలపులు (2) ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2) మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము|| కనులకు మోహము కమ్మిన క్షణము వినుట మరచె నీ స్వరమును హృదయము (2) కమ్మిన పొరలు కరిగించుటకు (2) నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2) ||కొంత యెడము|| మదము, మత్సరములు సోకిన తరుణము పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2) నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2) నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2) ||కొంత యెడము|| మనుజ రూపమున మహిలో నిలిచి మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2) నన
Telugu
10 views