కొనియాడ తరమే నిన్ను

Telugu Christian Song

కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను తనరారు దినకరు – బెను తారలను మించు (2) ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ|| కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2) నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ|| సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2) నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ|| విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2) పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ|| దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2) యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ|| నరులయందున కరుణ – ధర సమాధానంబు (2) చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ|| ఓ యేసు పాన్పుగ – నా యాత్
Telugu